చిరంజీవి – వెంకటేష్ కాంబినేషన్లో మనం మిస్ అయిన బ్లాక్ బస్టర్ మల్టీ స్టారర్.. ఏంటో తెలుసా..?

టాలీవుడ్ లో మల్టీ స్టార‌ర్ సినిమాలకు ఎటువంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ సినిమాల కంటే మల్టీ స్టారర్ సినిమాల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. మొదటి తరం హీరోస్ అయినా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ నాటి కాలంలో మల్టీ స్టార్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉండేది. మధ్యలో మల్టీ స్టార్ సినిమాలు రాకపోయినప్పటికీ.. కొంతకాలం తర్వాత మహేష్ బాబు – వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మల్టీ స్టార‌ర్ సినిమా హిట్ కావడంతో.. తర్వాత చాలా మల్టీస్టారర్ మూవీస్ రిలీజ్ అయి టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.

Chiranjeevi | Biography, Career, Age, Net worth, Movies

అలాంటి సూపర్ హిట్ కాంబినేషన్స్ కొన్ని సెట్స్ వరకు వచ్చి ఆగిపోయాయి. కాగా మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి విలన్ రోల్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే హీరోగా మరి ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. చిరంజీవికి ఎన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత రామానాయుడు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకటేష్.. తనదైన స్టైల్ లో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Andaz Apna Apna | doublegain.hk

 

కుటుంబ కథ నేపథ్యంలో ఉన్న సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. అయితే కొన్ని కోట్లాదిమంది ఫాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వెంకటేష్.. చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటారు. ఇక అసలు విషయానికి వస్తే మనం చిరంజీవి – వెంకటేష్ కాంబినేషన్లో ఒక సినిమాను మిస్ అయ్యామని మీకు తెలుసా..? అదేంటంటే బాలీవుడ్లో 1994లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్ అందాజ్ అప్నా అప్నా బాలీవుడ్ లో ఈ సినిమాల అమీర్ ఖాన్ – సల్మాన్ ఖాన్ హీరోలుగా నటించారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ గా నిలిచింది.

Daggubati Venkatesh rare photos - Sakshi

కాగా ఇదే సినిమాని చిరంజీవి – వెంకటేష్ కాంబోలో ఇవివి సత్యనారాయణ తెలుగులో తీయాలని అనుకున్నారట. దీనికోసం వెంకటేష్ – చిరంజీవి ఇద్దరిని సంప్రదించి విషయం కూడా చెప్పాడ‌ట. ఇద్దరు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. అయితే ఆ సమయంలో చిరంజీవి, వెంకటేష్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో ఈ కాంబినేషన్లో సినిమా పోస్ట్ పోన్ అయ్యిందట. అయితే వారి ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వడానికి బాగా ఆలస్యం అవ్వడంతో.. తరువాత ఈవివి సత్యనారాయణ ఈ సినిమాను పక్కన పెట్టేసాడట. అలా మనం చిరంజీవి – వెంకటేష్ కాంబోలో రావలసిన బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్ మూవీ ని మిస్ అయిపోయాం.