చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని అతి తక్కువ సమయంలోనే తెరమరుగైన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటి హీరోయిన్లలో టాలీవుడ్ హీరోయిన్ మాధవి లత కూడా ఒకరు. నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మాధవి.. తర్వాత పలు సినిమాల్లో నటించినా సక్సెస్ లేక అవకాశాలు తగ్గి పాలిటిక్స్ లోకి మారిపోయింది. అక్కడ కూడా కాలం కలిసి రాక ప్రస్తుతం సినిమాలకు రాజకీయాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.
అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తుంది. మాధవీలత సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండడంతో ఆమెను చాలామంది ఫాలో అవుతున్నారు. ఆమె పెట్టే పోస్టులపై కూడా స్పందిస్తూ ఉంటారు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఆమె పెళ్లి గురించి పలువురు నెటిజన్లు ప్రశ్నలు వేస్తూ ఆమెను బాగా టార్చర్ చేశారు.
ఈ నేపథ్యంలోనే పెళ్లి పట్ల తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మాధవి. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ‘‘ ప్రియమైన సమాజం.. ఓ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే వయసు ఒకటే సరిపోదు. ఆమె శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి. పెళ్లి చేసుకోవటం అనేది ఆమె నిర్ణయం’’ అని పేర్కొంది.
తాను కూడా ప్రస్తుతం శారీరకంగా, మానసికంగా కూడా పెళ్లికి సిద్దంగా లేనని, భవిష్యత్ లో కూడా దానిపై క్లారిటీ లేదని పేర్కొంది. ఇది నా జీవితం, నా ఇష్టం అంటూ రాసుకొచ్చింది మాధవి. తాను మైగ్రేన్ సమస్యతో బాధ పడుతున్నానని మాధవీలత వెల్లడించారు. దీంతో చాలా మంది నెటిజన్లు అయ్యో నీకు ఈ ప్రాబ్లమ్ ఉందా ? అంటూ సానుభూతితో కామెంట్లు పెడుతున్నారు.