స్టార్ హీరోయిన్ల‌ను మించిన అందంతో ఉన్న ఈమె.. టాలీవుడ్ స్టార్ హీరో కూతురు.. గుర్తు ప‌ట్టారా…!

ఈ ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..? స్టార్ హీరోయిన్ల‌ను మించిన అందంతో ఉన్న ఈమె ఇప్పటివరకు తెరపై కనిపించకపోయినప్పటికీ ఈమె తండ్రి వరుసగా సూపర్ హిట్ సినిమాలతో ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ఇంతకీ ఎవరి అమ్మాయి..? ఎవరా స్టార్ హీరో..? ఒక సారి చూద్దాంరండి. మాస్ మహారాజా రవితేజ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి వచ్చి యాక్టర్ గా మారిన ర‌వితేజ‌ ఇప్పుడు స్టార్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్నాడు. కాగా రవితేజ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఇంత క్రేజ్ తో దూసుకుపోతున్న రవితేజ ఇప్పటికి కొత్త డైరెక్టర్ప్ కి ఛాన్స్ ఇస్తూ సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల చిరంజీవితో నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న రవితేజ. శ్రీ లీలతో ధమాకా సినిమాలో నటించి హిట్ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో సినిమా లో ఫుల్ క్రేజ్ తో రాణించిన రవితేజ తన కుటుంబ విషయాలను మాత్రం ఎప్పుడు గోప్యంగా ఉంచుతూ వచ్చాడు. అయితే రవితేజ – మెహరీన్ జంటగా నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ కొడుకు రవితేజ చిన్నప్పటి రోల్ లో న‌టించాడు. ఇక అసలు విషయానికి వస్తే రవితేజ అసలు పేరు భూపతి రాజా రవిశంకర్ రాజు.

రవితేజ భార్య కళ్యాణి. విరికి ఇద్దరుపిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు పేరు మహాధన్ భూపతి రాజు, కూతురు మోక్షధ భూపతి రాజు. కాగా రవితేజ కూతురు ఇప్పటివరకు ఫోకస్లోకి రాలేదు. ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే అందరూ నోరెళ్లబెడతారు. రవితేజ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కూతురితో రవితేజ దిగిన ఫోటోలు చూసిన రవితేజ ఫ్యాన్స్ కాక చాలామంది నెట్టిజ‌న్స్ కూడాస్టార్ హీరోయిన్లను మించి అందంగా ఉన్నావు అంటు కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి కొంత మంది ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు సినిమాల్లోకి వస్తుందా..? అని ఎదురుచూస్తున్నారు..!!